కర్ణాటకలో కలకలం.. విలేకరుల ముందే మంత్రి రాజీనామా

కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు పతాకస్థాయికి చేరాయి. డీకే కేబినెట్‌లో తనకు ఆశించిన మంత్రిత్వ శాఖ దక్కకపోవడంతో సీనియర్ కాంగ్రెస్ నేత రామలింగా రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బెంగళూరు డెవలప్‌మెంట్ శాఖ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి గుడ్‌బై చెప్పేశారు. విలేకరుల ముందే రాజీనామా లేఖపై సంతకం చేశారు.‘ఆ శాఖ నాకే ఇస్తానని రెండు సార్లు వాళ్లు చెప్పారు. కానీ అది జరగలేదు. ఇది నిరాశ కలిగించింది. అందుకే రాజీనామా చేస్తున్నా’ అని అన్నారు. ‘డీకే మా ఇంటికి వచ్చి మరీ చెప్పారు. తాను సీఎం కాగానే తన వద్ద ఉన్న బెంగళూరు డెవలప్‌మెంట్ శాఖను నాకు...