భవిష్యత్తులో వర్షాలు వచ్చే పరిస్థితి లేదు.. నీటిని ఆదా చేయండి: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కృష్ణకాంత్ పార్క్‌లో హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా 12 రోజుల పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంతో నాకు సంబంధం లేదని ఎవ్వరూ అనుకోవద్దని తెలిపారు. అశోక చక్రవర్తి ఆనాడు మొక్కలు నాటారని.. ఈరోజు కూడా అది జ్ఞాపకం చేసుకుంటామని అన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని కోరారు.ఢిల్లీ కాలుష్యపు కోరల్లో చిక్కుకుందని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితి రావొద్దని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. EV...