బాక్సాఫీస్ ఛాంపియన్.. థియేటర్లలో పెద్ది ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. ఎంతో కాలంగా మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చి బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆటలోనూ, పోరాటంలోనూ తిరుగులేని ఛాంపియన్‌గా నిలిచిన ‘పెద్ది’.. బాక్సాఫీస్ వద్ద కూడా అదే స్థాయిలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో అభిమానులను మెప్పించగా, ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన ఖాతాలో ఘన విజయం పడటంతో థియేటర్ల వద్ద సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ ‘పెద్ది’ మొదటి రోజు అధికారిక కలెక్షన్ల...