ఏంటీ.. లారెన్స్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.
సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి రాఘవ లారెన్స్. ముఖ్యంగా ‘ముని’, ‘కాంచన’ సిరీస్‌లతో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ప్రస్తుతం ‘కాంచన 4’తో పాటు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌కు చెందిన ‘బెంజ్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్న లారెన్స్ కుటుంబం నుంచి ఇప్పుడు ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. రాఘవ లారెన్స్ వారసురాలు, ఆయన కుమార్తె రాఘవి త్వరలోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే సాధారణంగా స్టార్ వారసులు అనగానే నటన వైపు మొగ్గు చూపుతారు....