కీళ్ల నొప్పులకు వాతావరణ మార్పులే కారణమా? తెలుసుకోవాల్సిన విషయాలు

చాలామంది వాతావరణం మారినప్పుడు కీళ్లలో బిగుతు, నొప్పి, కదలికల్లో ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదని, వాతావరణ పరిస్థితులకు మరియు కీళ్ల ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. వాతావరణ మార్పులు కీళ్లపై ఎలా ప్రభావం చూపుతాయి?నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉష్ణోగ్రత తగ్గడం లేదా పెరగడం, గాలి పీడనంలో మార్పులు, తేమ అధికంగా ఉండటం వంటి అంశాలు కీళ్లలోని కణజాలాలపై ప్రభావం చూపవచ్చు. దీంతో కీళ్లలో బిగుతు, నొప్పి, భారంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా ఉదయం నిద్రలేచినప్పుడు లేదా ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చున్న తర్వాత ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రతి ఒక్కరిపై...