కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

టెక్నాలజీ వేగంగా మారుతున్న ఈ రోజుల్లో ల్యాప్‌టాప్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లకు చాలా అవసరంగా మారాయి. ఆన్‌లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోమ్, ప్రాజెక్టులు, వీడియో ఎడిటింగ్ వంటి పనుల కోసం చాలామంది కొత్త ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. అయితే మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు, మోడళ్లు ఉండటంతో సరైన ల్యాప్‌టాప్ ఎంపిక చేయడం కొంత కష్టంగా మారింది. కేవలం ధర చూసి కొనకుండా, అవసరాలకు తగ్గ ఫీచర్లను పరిశీలించడం చాలా ముఖ్యం. ప్రాసెసర్ల్యాప్‌టాప్‌లో ముఖ్యమైన భాగం ప్రాసెసర్. సాధారణ పనులు, ఆన్‌లైన్ క్లాసులు, బ్రౌజింగ్ కోసం Intel i3 లేదా Ryzen 3 సరిపోతాయి. మల్టీటాస్కింగ్, కోడింగ్, డిజైన్ పనుల కోసం Intel i5...