పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: హోం మంత్రి అనిత

అమరావతి, జూన్ 05: ప్రపంచ పర్యావరణ దినోత్సవం, నో వెహికల్ డే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సహా ప్రజా ప్రతినిధులు సైకిల్ తొక్కారు. అలానే రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విజయవాడలో తన నివాసం నుంచి ఆటోనగర్ ఫైర్ స్టేషన్ వరకు సైకిల్ తొక్కారు. అనంతరం ఆమె ఏబీఎన్‌తో మాట్లాడారు. రోజూ ఓ గంట పాటు సైకిల్ తొక్కడం వల్ల ఓవైపు ఆరోగ్యం, మరోవైపు పర్యావరణం బాగుపడతాయని తెలిపారు. ప్రధాని పొదుపు మంత్రంలో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం మేరకు ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పాటిస్తున్నామని ఆమె వెల్లడించారు. 'సీఎం చంద్రబాబు, డిప్యూటీ...