తెలంగాణ అభివృద్ధికి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ అవసరం: రాంచందర్‌‌రావు

మహబూబాబాద్, జూన్ 5: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో రాంచందర్‌‌రావు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనలో నిధులు, నియామకాలు, సాగునీటి వ్యవస్థల్లో వైఫల్యాలు జరిగాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. అవినీతి, నిర్లక్ష్యంతో పాలన సాగిస్తోందని వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ హామీ పూర్తిగా అమలు కాలేదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ అవసరమని వెల్లడించారు. 2014 తర్వాత దేశంలో సంక్షేమం, అభివృద్ధి సమన్వయంతో ముందుకు సాగుతోందని రాంచందర్‌రావు అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,...