పాలన చేతకాకపోతే రాజీనామా చేయాలి: ఎంపీ ధర్మపురి అరవింద్

హైదరాబాద్‌: పాలన చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, బీజేపీ నేతల ఇళ్ల ముందు ధాన్యం పోస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రైతుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి రాజకీయాలు చేయడం తగదని అరవింద్ వ్యాఖ్యానించారు.కేంద్రంపై నెపం సరికాదువరి కోతలు ప్రారంభమయ్యే ముందే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత...