హిమంత మంత్రివర్గ విస్తరణ.. 12 మందికి చోటు
గువాహటి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ తన మంత్రివర్గాన్ని శుక్రవారంనాడు విస్తరించారు. కొత్తగా 12 మంది ఎన్డీయే ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. గువాహటిలోని లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ప్రమాణస్వీకారం చేయించారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రితో కలిపి మంత్రి మండలి సభ్యులసంఖ్య 17కు చేరింది.కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో అశ్విని రాయ్ సర్కార్, అశోక్ సంఘాల్, బిమల్ బోరా, బిశ్వజిత్ డైమరీ, జయంత మల్లా బరువా, కౌషిక్ రాయ్, కేషబ్ మహంతా, కిృష్ణేందు పాల్, నీలిమా దేవి, పిజుష్ హజారికా, రనోజ్ పెగు, సుశాంత బోర్గో హైన్ ఉన్నారు. బిన్న భాషా సమ్మేళనంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది....