ఇది సబబు కాదు.. సుప్రీంకోర్టుపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి
ఎన్నికల ఫలితాలకు సంబంధించి కింది కోర్టు తీర్పుపై అప్పీ్ల్ సుప్రీం కోర్టులో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కేసుల్లో ఆరు నెలల్లోపు తీర్పు ఇవ్వాలని సుప్రీం స్వయంగా గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. ఈ మార్గదర్శకాలకు సుప్రీం కోర్టు కట్టుబడకపోతే చివరకు దేశంలో నిరంకుశత్వానికి దారితీస్తుందని హెచ్చరించింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఇన్బదురై గెలుపును సవాలు చేస్తూ డీఎంకే నేత అప్పావు దాఖలు చేసిన కేసులో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.2016 నాటి ఎన్నికల్లో ఇన్బదురై రాధాపురం నియోజకవర్గం నుంచి స్వల్ప మెజారిటీతో గెలిచారు. అయితే, ఈ ఫలితాన్ని అప్పావు మద్రాస్...