తెలంగాణ జల హక్కులను కాపాడటంలో సర్కార్ విఫలం: హరీశ్ రావు
హైదరాబాద్, జూన్ 5: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ జల హక్కులు తీవ్ర ప్రమాదంలో పడ్డాయని లేఖలో ఆరోపించారు. ఎత్తిపోతల పంపుల నిర్వహణ విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికలను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. దీంతో పంపులు దెబ్బతిని, కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో తీవ్ర వైఫల్యం చోటుచేసుకుందని తెలిపారు. తెలంగాణ జల హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపించారు. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ 74 శాతం వినియోగిస్తుంటే.. తెలంగాణ 25 శాతానికి పరిమితమైందని లేఖలో తెలిపారు.రైతులు,...