తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి : చాడ వెంకట్ రెడ్డి
వేములవాడ, జూన్ 5: తెలంగాణ రాష్ట్ర విభజన తీరును వక్రీకరిస్తూ మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి సిపిఐ రాజకీయ శిక్షణ తరగతులు వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్ లో శుక్రవారం ప్రారంభించగా ఆయన హాజరై మాట్లాడారు. 12 సంవత్సరాల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర విభజనను మరోసారి వక్రీకరించి మాట్లాడడం సరికాదని అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జాగిరే తెలంగాణ రాష్ట్రమని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. ఆవేశానికి కేరాఫ్ గా నిలిచిన పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి మేధావుల...