ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తంగేడు మొక్కలు నాటిన జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యులు

సిద్ధిపేట, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్ హెచ్ ఆర్ సి సిద్ధిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాగదేవత ఆలయం మరియు కొండ మైసమ్మ ఆలయ ప్రాంగణాల్లో తెలంగాణ రాష్ట్ర పుష్ప చిహ్నమైన తంగేడు పూల మొక్కలను నాటారు నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తంగేడు పువ్వు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ముఖ్యంగా బతుకమ్మ పండుగలో తంగేడు పూలకు విశిష్ట స్థానం ఉందని తెలిపారు. తంగేడు మొక్కలు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, జీవ వైవిధ్యాన్ని పెంపొందించటంలో మరియు ప్రకృతికి అందాన్ని చేకూర్చటంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను...