నిద్రహారాలు మాని జొన్న టోకెన్ల కోసం కుభీర్ రైతుల నిరీక్షణ.. క్యూలైన్‌లో తోపులాట

భాసాగా మారింది. మూడు కౌంటర్లు ఏర్పాటు చేసిన టోకెన్లు ఇస్తుండగా రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో మహిళ రైతులు కిందపడటంతో స్వల్పంగా గాయపడ్డారు. ఐకేపీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నుంచి టోకెన్లు జారీ చేస్తుండటంతో శుక్రవారం రాత్రి నుంచే ఐకేపీ కార్యాలయానికి చేరుకుని రైతులు బారులు తీరారు. కార్యాలయ ఆవరణలో చీకటిలో బండరాళ్లు క్యూలో పెట్టి అక్కడే ఇరువైపులా పడుకున్నారు. నిద్రాహారాలు మాని అక్కడే టోకెన్ల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం 9.30గంటల నుంచి సంబంధిత అధికారులు వచ్చి టోకెన్లు ఇవ్వడం మొదులపెట్టారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలిరావడంతో కౌంటర్ల వద్ద తోపులాట జరిగింది....