మేమేం గొర్రెలం కాదు’.. నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఆయన అన్న నాగబాబు పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ చాలా ఘాటుగా స్పందించారు. అసలు విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ మాటే శాసనమని, ఆయనకు ఏది మంచో ఏది చెడో బాగా తెలుసని నాగబాబు ట్వీట్ చేశారు. నాయకుడు నడిచే దారిలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో మిగతా వాళ్లకు తెలియదని.. కాబట్టి ఎవరూ నోరెత్తకుండా, ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఆయన వెనకాల నడవాలని నాగబాబు పేర్కొన్నారు.వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తీవ్రంగా మండిపడ్డారు. “ప్రశ్నించకుండా వెనకాల వెళ్లడానికి మేమేమీ గొర్రెలం కాదు.. బానిస బ్రతుకులు బ్రతకడానికి సిద్ధంగా...