సుఖోయ్-57 తయారీ కోసం భారత్‌కు సహకరిస్తాం: పుతిన్
న్యూఢిల్లీ: ఫిఫ్త్ జనరేషన్ సుఖోయ్-57ని భారత్‌తో కలిసి సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు రష్యా అనుకూలంగా ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) ఈ విషయాన్ని వెల్లడించారు. భారత విదేశాంగ విధానాన్ని పుతిన్ ప్రశంసించిన విషయం తెలిసిందే. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న సమావేశాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అక్కడ సుఖోయ్-57 యుద్ధ విమానం తయారీకి సంబంధించిన అప్‌డేట్ కూడా ఇచ్చారు. భారత్‌తో రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిలో భాగంగానే స్టీల్త్ ఫైటర్ విమానం సుఖోయ్-57ని రెండు దేశాలు కలిసి తయారీ చేయనున్నట్లు చెప్పారు. అడ్వాన్సడ్ ఫైటర్ జెట్ తయారీ అంశంలో భారత్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సుఖోయ్-57 విమానాన్ని...