భూమికి వచ్చేందుకు సిద్ధంగా ఉండండి.. ఐఎస్‌ఎస్‌లోని వ్యోమగాములకు నాసా ఆదేశాలు

అంతరిక్ష కేంద్రంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతరిక్ష కేంద్రంలోని రష్యాకు చెందిన రోస్కోమస్‌ స్పేస్‌ ఏజెన్సీలోని జ్వేజ్డా విభాగంలో కొన్ని నెలల తరబడి గాలి లీక్‌ అవుతున్నది. మొన్నటిదాకా పరిస్థితి స్థిరంగా ఉన్నా.. సోమవారం నాటికి గాలి లీక్‌ తీవ్రత భారీగా పెరిగిపోయింది. దీంతో క్రూ-12 మిషన్‌కు చెందిన నలుగురు వ్యోమగాములను వెంటనే వారికోసం ఏర్పాటు చేసిన క్రూ డ్రాగన్‌ మిషన్‌లోకి వెళ్లి స్పేస్‌ సూట్లను ధరించాలని నాసా ఆదేశించింది. కుదిరితే తరలింపునకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. ఇందులో ఇద్దరు అమెరికన్‌, ఒక ఫ్రెంచ్‌, ఒక రష్యన్‌ వ్యోమగామి ఉన్నారు. అంతరిక్ష కేంద్రం లో ప్రధాన ఆపరేటర్లుగా ఉన్న అమెరికా, రష్యన్‌ స్పేస్‌ ఏజెన్సీలు ఈ...