ప్రమాదం తర్వాత తొలిసారి మాట్లాడిన పండు మాస్టర్.. కళ్లనీళ్లు పెట్టుకుంటూ జరిగిన విషయం వెల్లడి

తెలుగు బుల్లితెరపై తన ప్రత్యేకమైన డాన్స్ స్టైల్, అద్భుతమైన కొరియోగ్రఫీతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ పండు మాస్ట‌ర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్న పండు మాస్టర్ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రమాదం ఎలా జరిగిందో వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఆసుపత్రి బెడ్‌పైనే కళ్లనీళ్లు పెట్టుకుంటూ మాట్లాడిన పండు మాస్టర్ మాటలు అభిమానులను కలచివేస్తున్నాయి. ప్రమాద సమయంలో ఎదురైన భయానక పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఆయన వివరించారు. పండు మాస్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం, తగరపువలసలో ఓ ఈవెంట్ పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణం ప్రారంభించారు....