ప్రకృతిని, పక్షులను సంరక్షించేందుకు బర్డ్‌వాక్ : అదనపు కలెక్టర్
మెదక్ రూరల్ : ప్రకృతి పరిరక్షణ, పక్షుల సంరక్షణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో బర్డ్ వాక్ కార్యక్రమం నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. శనివారం పోచారంలోని డీబీసీలో నిర్వహించిన బర్డ్ వాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోచారం ల్యాండ్‌స్కేప్‌లో గొప్ప పక్షి వైవిధ్యం, సహజ వారసత్వం ఉందని దీనిని కాపాడేందుకు బర్డ్ వాక్ నిర్వహించామన్నారు. పోచారం జలాశయం , అభయారణ్యం చుట్టూ ఉన్న పోచారం ప్రాంతం, వలస నీటి పక్షులు, కొంగలు, ఐబీస్‌లు, బాతులు అనేక అటవీ ప్రాంతాలతో సహా విభిన్న...