తెలంగాణ నీటిని ఆంధ్రాకు దోచిపెట్టే కుట్రలు జరుగుతున్నాయి.. సీఎం రేవంత్‌పై శ్రీనివాస్ గౌడ్ ధ్వజం

కాంగ్రెస్ పాలనలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ నష్టం మహబూబ్‌నగర్‌కు జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నిన్న మంత్రి, ముఖ్యమంత్రి మాటలకు ప్రజల నుంచి స్పందన లేదని తెలిపారు. ఇప్పటికైనా చిల్లర మాటలను సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలని హితవుపలికారు. పాత చింతకాయ పచ్చడిలా రేవంత్ రెడ్డి ప్రసంగం ఉందని ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్‌లో శనివారం ఉదయం మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం పర్యటన గురించి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఆశతో ఎదురుచూశారని తెలిపారు. కానీ ఉమ్మడి జిల్లా ప్రజలకు సీఎం ఇచ్చింది ఏమీ లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ కట్టిన...