రైతులకు న్యాయం చేయమని అడిగితే.. కాంగ్రెస్ నాయకులను సైతం అరెస్టు చేయించిన రేవంత్ సర్కార్!

క్షాన నిలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు సైతం అరెస్టులు తప్పడంలేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కోహెడ పండ్ల మార్కెట్ ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని వారికి మద్దుతుగా నిలిచిన కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడితో స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అరెస్టు చేయించారు. కోహెడ పండ్ల మార్కెట్ భూములు ఇచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలని కొంతకాలంగా ఆందోళన చేపట్టారు. కోహెడ మాజీ కౌన్సిలర్లు కంబాలపల్లి ధనరాజ్, బండారు బాలరాజ్‌లు ఈ ఆందోళనలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. శనివారం కోహెడలో అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్...