'ఆల్ఫా’ ట్రైలర్ విడుదల.. యాక్షన్ మోడ్‌లో అదరగొట్టిన ఆలియా భట్

ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఆల్ఫా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. విడుదలైన వెంటనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో అలియా భట్ , షార్వారి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, బాబీ దెవొల్ , అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివ రావైల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే బాలీవుడ్‌లో భారీ అంచనాలు సృష్టిస్తోంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో తొలి మహిళా కేంద్రిత గూఢచారి యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ‘ఆల్ఫా’ కథ భారత భద్రత కోసం...