కేటీఆర్ ఓ 'ట్విట్టర్ టిల్లు'.. సవాల్ స్వీకరించే దమ్ములేని డ్రామారావు: మంత్రి పొంగులేటి తీవ్ర విమర్శలు

"ట్విట్టర్ టిల్లు.. చెప్తడు అబద్దాల సొల్లు.. అన్నట్టుగా ఉంది కేటీఆర్ వ్యవహారం. సవాల్ స్వీకరించే దమ్ము లేక ఆయన డ్రామాలు ఆడుతున్నారు" అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్‌లో కేటీఆర్ పాలేరులో పట్టపగలే అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తన ఫేస్ బుక్ పేజీలో మండిపడ్డారు. ​పదేండ్ల ఫ్లాప్ షో.. రెండేండ్ల టాప్ షో! ​పదేండ్లు అధికారంలో ఉండి పేదలకు ఎన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇచ్చారో చెప్పలేని కేటీఆర్ , కేవలం రెండున్నరేండ్లలోనే లక్షలాది పేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమని మంత్రి...