థియేటర్లలో ‘పెద్ది’ రీలోడెడ్ వెర్షన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెద్ది’ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్త రూపంలో థియేటర్లలోకి వచ్చింది. చిత్రానికి సంబంధించిన రీలోడెడ్ వెర్షన్‌ను గురువారం నుంచి ప్రదర్శనకు తీసుకొచ్చినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని సినిమాలో దాదాపు ఆరు నిమిషాల నిడివి గల అదనపు సన్నివేశాలను చేర్చినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ కొత్త సన్నివేశాల ద్వారా ప్రధాన పాత్రల భావోద్వేగాలు, కథలోని కీలక అంశాలను మరింత ప్రభావవంతంగా చూపించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ప్రత్యేకంగా కథానాయిక జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు, జగపతి బాబు పాత్రలోని కీలక...