మెట్ టెండర్లలో ‘గోల్‌మాల్’ లేదు.. అంతా పారదర్శకమే: హైడ్రా క్లారిటీ!

తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తప్పదు! ​నిబంధనల మేరకే ఎంపిక.. సడలింపులపై స్పష్టత ​బ్లాక్ లిస్ట్ భయంతోనే బురదజల్లే ప్రయత్నం? ​ రాబోయే వర్షాకాలంలో నగర ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు చేపట్టిన ‘మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్’ (MET) టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని హైడ్రా (HYDRAA) స్పష్టం చేసింది. టెండర్ల ఎంపిక ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగిందని, కొందరు కావాలనే సాంకేతిక అంశాలను భూతద్దంలో చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడింది. ​తొమ్మిది మంది ఇంజినీర్ల కమిటీతోనే స్క్రీనింగ్! జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలకు చెందిన తొమ్మిది మంది అనుభవజ్ఞులైన ఇంజినీర్లతో కూడిన ప్రత్యేక కమిటీ ప్రతి...