బ్లాక్ లిస్ట్‌లో భూమి.. తహసీల్దార్‌పై చర్యలేవి?
కోర్టు వివాదంలో ఉన్న భూమికి మ్యూటేషన్.. తర్వాత సర్వే నంబర్ బ్లాక్ బాధితుల ఫిర్యాదులను పట్టించుకోలేదన్న ఆరోపణలు పరకాల తహసీల్దార్ వ్యవహారంపై ఉన్నతాధికారుల మౌనం ప్రశ్నార్థకం కోర్టు వివాదంలో ఉన్న భూమికి మ్యూటేషన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసిన వ్యవహారం హన్మకొండ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్రమ మ్యూటేషన్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో సంబంధిత సర్వే నంబర్‌ను అధికారులు బ్లాక్ లిస్ట్‌లో చేర్చినా, ఈ నిర్ణయం ద్వారా తప్పు జరిగిన విషయాన్ని పరోక్షంగా అంగీకరించినట్టేనని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే వివాదాస్పద భూమికి మ్యూటేషన్ చేసిన తహసీల్దార్‌పై ఇప్పటివరకు ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల...