ప్రభుత్వ భూమి కబ్జా?

రూ.2 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ప్రహరీ.. నాలా కన్వర్షన్ పేరుతో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసే యత్నమా..? ఒక సర్వే నెంబర్‌లో నాలా.. మరో సర్వే నెంబర్‌లో ప్రహారీ నిర్మాణం..? హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్ శివారులో ప్రభుత్వ భూమి ఆక్రమణకు సంబంధించిన వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న సుమారు 10 గుంటల ప్రభుత్వ భూమిని దక్కించుకునేందుకు ఓ పలుకుబడి కలిగిన బడా కాంట్రాక్టర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికంగా ప్రచారం జరుగుతున్న వివరాల ప్రకారం, సుమారు రూ.2 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ముందుగా నాలా...