తెలంగాణ ప్రజలకు అలర్ట్: వరుసగా 3 రోజుల పాటు రిజిస్ట్రేషన్లు బంద్!
తెలంగాణలో ఇళ్లు, స్థలాలు లేదా భూముల కొనుగోలు, అమ్మకాలు చేయాలనుకునే వారికి తెలంగాణ స్టాంపులు - రిజిస్ట్రేషన్ల శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో పాటు దానికి సంబంధించిన ఆన్‌లైన్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. సేవలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆగిపోతాయి? జూన్ 26వ తేదీ (శుక్రవారం) నుంచి జూన్ 28వ తేదీ (ఆదివారం) వరకు రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోనున్నాయి. జూన్ 29వ తేదీ (సోమవారం) నుంచి యథాతథంగా సేవలు అందుబాటులోకి వస్తాయి. కారణం ఏంటి? రిజిస్ట్రేషన్ల శాఖలో సర్వర్ అప్‌గ్రేడేషన్, సాంకేతిక నిర్వహణ (మెయింటెనెన్స్) పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు...