​భారత రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర: రాహుల్ గాంధీ

భారత రాజకీయాల్లో నాలుగు తరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన నెహ్రూ-గాంధీ కుటుంబ వారసుడిగా, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు (జూన్ 19) తన 56వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన.. నేడు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా నిరంతర ప్రజా పోరాటాలతో దేశ రాజకీయ పరిణామాల్లో అగ్రగామిగా నిలిచారు. ​కార్పొరేట్ నుంచి పార్లమెంట్ దాకా.. ​1970 జూన్ 19న న్యూఢిల్లీలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ దంపతులకు జన్మించిన రాహుల్, చిన్నతనం నుంచే రాజకీయ వాతావరణాన్ని చూశారు. విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన...