క్రీడా తెలంగాణ దిశగా భారీ అడుగు
రూ.50.73 కోట్లతో క్రీడా మౌలిక వసతుల విస్తరణ రాష్ట్రవ్యాప్తంగా మినీ స్టేడియంలు, శిక్షణా అకాడమీలకు శ్రీకారం గ్రామీణ యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలే లక్ష్యం తెలంగాణలో క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.50.73 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్త క్రీడా అకాడమీలను ప్రారంభించడంతో పాటు జిల్లాల్లో నిర్మించనున్న మినీ స్టేడియాల పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రీడల అభివృద్ధిని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా...