HCA అవినీతి ఆరోపణలపై లోకాయుక్త కీలక ఆదేశాలు

4 వారాల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం 15 ఏళ్లలో రూ.600 కోట్ల అవినీతి జరిగిందన్న టీసీఏ ఫిర్యాదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి వ్యవహారంపై తెలంగాణ లోకాయుక్త కీలక ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) చేసిన ఫిర్యాదులను నాలుగు వారాల్లోగా విచారించి చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఐడీని ఆదేశించింది. హెచ్‌సీఏలో గత 15 ఏళ్ల కాలంలో సుమారు రూ.600 కోట్ల మేర అవినీతి జరిగిందని టీసీఏ లోకాయుక్తను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదులపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో విచారణను వేగవంతం చేయాలని లోకాయుక్త స్పష్టం చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న...