ప్రజావాణి చొరవ..నవజాత శిశువుకు పునర్జన్మ!
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'ప్రజావాణి' కార్యక్రమం ఒక పేద కుటుంబంలో వెలుగులు నింపింది. పుట్టుకతోనే ప్రాణాంతక గుండె సమస్యతో కొట్టుమిట్టాడుతున్న ఒక నవజాత శిశువుకు సకాలంలో అండగా నిలిచి, రూ. 8 లక్షల ఉచిత శస్త్రచికిత్సతో ఆ చిన్నారికి పునర్జన్మ ప్రసాదించింది. కన్నీళ్లలో కూలీ కుటుంబం హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌కు చెందిన అంజనేయులు అనే రోజువారీ కూలీ భార్యకు ఇటీవల ఒక ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు 'గ్రేసీ' అని పేరు పెట్టుకున్నారు. అయితే, పుట్టిన కొద్దిసేపటికే ఆ చిన్నారి తీవ్రమైన జన్యుపరమైన గుండె లోపంతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. అత్యవసరంగా శస్త్రచికిత్స చేయకపోతే పాప ప్రాణాలకే ప్రమాదమని తేల్చిచెప్పారు. ఆపరేషన్‌కు రూ. 8 లక్షల...