నిరంజన్‌కు బండ్ల గణేష్ భారీ ఆర్థిక సాయం: పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రూ. 5 లక్షల చెక్ అందజేత!
ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండకు చెందిన బాలుడు నిరంజన్ కుటుంబానికి ప్రముఖ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ అండగా నిలిచారు. గతంలో ప్రకటించిన విధంగానే శనివారం హనుమకొండ, హనుమాన్ నగర్‌లోని బాలుడి నివాసానికి బండ్ల గణేష్ స్వయంగా వెళ్లారు. నిరంజన్‌తో మాట్లాడి, అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులు రాంగోపాల్ చారి, మానసలకు ధైర్యం చెప్పి, తమ 'పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్' తరఫున రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా... ఈ సందర్భంగా బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారా భువనేశ్వరి గారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఈ...