హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతానికి సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త అడుగు!
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం మరోసారి లేఖ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి జూన్ 22, 23 తేదీల్లో ఢిల్లీ పర్యటనలో చర్చించనున్న ముఖ్యమంత్రి హైదరాబాద్ మహానగర రవాణా ముఖచిత్రాన్ని మార్చే అత్యంత కీలకమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు (ఫేజ్-2) విస్తరణను పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి తాజాగా మరోసారి లేఖ రాశారు.కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ...