‘నీట్’ రీ-ఎగ్జామ్ -ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా రేపు (ఆదివారం) జరగనున్న 'నీట్' (NEET) రీ-ఎగ్జామ్ ఒత్తిడిని తట్టుకోలేక ఓ వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ​పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ​ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన జాఫర్ హుసేన్ ప్రస్తుతం కువైట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన కుటుంబం హైదరాబాద్, మియాపూర్ కల్వరీ టెంపుల్ సమీపంలో నివాసముంటోంది. జాఫర్ కుమార్తె సనా (19) వైద్యురాలు కావాలనే లక్ష్యంతో 'నీట్' పరీక్ష కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది. ​ఘటన ఎలా జరిగిందంటే..? ​నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 3న నిర్వహించిన...