కన్నప్రేమ కరువైంది.. కామంధుడి మోజులో కన్నకొడుకునే కాటేసింది!

ఏకాంతానికి అడ్డొస్తున్నాడని రెండేళ్ల చిన్నారిని కొట్టి చంపిన కసాయి తల్లి ​ఫిట్స్ అంటూ భర్తను నమ్మించి అంత్యక్రియలు.. నిలదీయడంతో వెలుగులోకి దారుణం ​తీగుళ్లలో విషాదం.. కీసర పోలీసుల నిఘాలో రీ-పోస్ట్‌మార్టం అమ్మ అనే పిలుపులో అమృతం ఉంటుంది. బిడ్డకు కాస్త నలత చేస్తే ఆ తల్లి గుండె కోసుకుపోతుంది. కానీ, ఇక్కడో కన్నతల్లి పరాయి వ్యక్తి మోజులో పడి, తనే ప్రాణమిచ్చిన కన్నపేగును నిలువునా తుంచేసింది. తన సుఖాల కోసం, ఏకాంతానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో కేవలం రెండేళ్ల పసికందును ప్రియుడితో కలిసి కొట్టి చంపింది. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుళ్లకు చెందిన ఒక కుటుంబంలో జరిగిన ఈ అమానవీయ ఘటన సమాజాన్ని తలదించుకునేలా...