నాడు సంకల్పం... నేడు కళ్లముందు దృశ్యం!

శాశ్వత ఆస్తుల సృష్టితో తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ సీఎం విజన్ ​సచివాలయం నుంచి కాళేశ్వరం దాకా... యాదాద్రి నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ వరకు అన్నీ అద్భుతాలే! BY PRAMOD NAMEENDLA / మన విశ్వం ప్రత్యేక ప్రతినిధి ఒక దేశ చరిత్రను మార్చాలన్నా... ఒక రాష్ట్ర భవిష్యత్తును తిరగరాయాలన్నా కేవలం పరిపాలన చేస్తే సరిపోదు, శతాబ్దాల పాటు నిలిచిపోయే దృఢమైన సంకల్పం, భావితరాలకు భరోసానిచ్చే విజన్ ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆ బాధ్యతను భుజానికెత్తుకున్న మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన మహా నిర్మాణాలే నేడు తెలంగాణను దేశంలోనే ప్రత్యేక రాష్ట్రంగా నిలబెట్టాయి. భవనాలు...