మైనంపల్లికి మానసిక చికిత్స అవసరం: బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావుపై బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైనంపల్లి ప్రస్తుత పరిస్థితి "ధోబీకా కుత్తా.. నా ఘర్ కా నా ఘాట్ కా" అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు ఎలా తిరుగుతున్నాయో, కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు పిచ్చి కుక్కల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మైనంపల్లికి ప్రస్తుతం మానసిక చికిత్స అవసరమని, కొడుకు కారణంగా ఆయనకు రాజకీయంగా పని లేకుండా పోవడంతోనే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఒకే రోజు మూడు పార్టీలు మారిన చరిత్ర! మైనంపల్లి హన్మంతరావు గత రాజకీయ చరిత్రను గుర్తు చేస్తూ క్రిశాంక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.గతంలో టీడీపీలో ఉన్న సమయంలో...