రేపటి నుంచే ‘టీజీఈఏపీసెట్’ (TGEAPCET-2026) కౌన్సిలింగ్.. షెడ్యూల్ విడుదల!
తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘టీజీఈఏపీసెట్-2026’ (TGEAPCET) మొదటి విడత అడ్మిషన్ల కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు రేపటి (జూన్ 22) నుంచి ఈ ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఈ విడత కౌన్సిలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి: కౌన్సిలింగ్ ముఖ్య తేదీలు: ఫీజు చెల్లింపు & స్లాట్ బుకింగ్: జూన్ 28 వరకు అభ్యర్థులు ప్రాసెస్ ఫీజు చెల్లించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్: జూన్ 22 నుంచి జూన్ 29 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. వెబ్ ఆప్షన్ల నమోదు: జూన్ 25 నుంచి జూలై 1...