​భూపాలపల్లిలో ఘోర ప్రమాదం: విధి నిర్వహణలో DTO వెంకన్న దుర్మరణం

వాహనాల తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన బొగ్గు టిప్పర్.. అక్కడికక్కడే మృతి ​సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి; విచారణకు ఆదేశం ​భూపాలపల్లి, జూన్ 22:(మన విశ్వం ) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పరకాల-భూపాలపల్లి హైవేపై విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా అధికారి (DTO) / మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (MVI) ఎం. వెంకన్న బొగ్గు టిప్పర్ ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ​ఘటన వివరాలు... భూపాలపల్లి ​స్థానిక రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయం ముందే ఈ ప్రమాదం సంభవించింది. కార్యాలయం ఎదురుగా ఉన్న హైవేపై అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు....