"వచ్చే ఐదేళ్లు చిట్టి నాయుడుకి సినిమా చూపిస్తా" హన్మకొండ లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

"వచ్చే ఐదేళ్లు చిట్టి నాయుడుకి సినిమా చూపిస్తా" హన్మకొండ లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు ​హన్మకొండ /వర్ధన్నపేట(మన విశ్వం ) భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) వర్ధన్నపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని, కాంగ్రెస్ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. నేను కెసిఆర్ అంత మంచోణ్ని కాదు "వచ్చే ఐదేళ్ల పాటు చిట్టి నాయుడుకి, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ప్రతి అడుగులోనూ వారి వైఫల్యాలను ఎండగడతాం" అని కేటీఆర్ హెచ్చరించారు.బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు,...