బీఆర్ఎస్ నేతలపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం: ఎమ్మెల్యే నాయినికి కంజర్ల మనోజ్ హెచ్చరిక

హన్మకొండ, జూన్ 22​(మన విశ్వం ):వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బీఆర్ఎస్ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ 4వ డివిజన్ అధ్యక్షుడు కంజర్ల మనోజ్ కుమార్ ఘాటుగా హెచ్చరించారు. సోమవారం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.​ఇటీవల కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దుగ్గంపూడి రంజిత్ రెడ్డిలపై ఎమ్మెల్యే నాయిని చేసిన విమర్శలను మనోజ్ తీవ్రంగా ఖండించారు. ​​అభివృద్ధి శూన్యం – విమర్శలు ఘనం ఎమ్మెల్యే నాయిని రాజేందర్...