రామాలయ నిధుల కేసు: అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
అయోధ్య రామాలయ నిర్మాణ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును తక్షణమే విచారణకు తీసుకోవాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. జస్టిస్ పంకజ్ భాటియా, జస్టిస్ అమితాబ్ కుమారి రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి, ప్రస్తుతం అత్యవసర జోక్యానికి తగిన పరిస్థితులు కనిపించడం లేదని పేర్కొంది. లక్నో బెంచ్ ముందు ఇప్పటికే భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పక్కనబెట్టి ఈ వ్యాజ్యాన్ని ముందుగా విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌కు కొత్తగా నమోదైన కేసుల జాబితాలో 393వ సీరియల్ నంబర్ కేటాయించబడిందని...