​బాసరలో కలకలం: జ్ఞాన సరస్వతీ క్షేత్రంలో భారీ చోరీ!

ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ పరిసరాల్లో భారీ చోరీ జరిగింది. సరస్వతీ అమ్మవారి ప్రధాన ఆలయ పైఅంతస్తులో కొలువై ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దుండగులు టార్గెట్ చేశారు. ఆలయ గేటు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు.. అమ్మవారి వెండి కిరీటంతో పాటు, అక్కడ ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు. ​వ్యాసగుడి వద్ద హుండీ కలకలం దొంగలు హుండీలోని నగదు మొత్తాన్ని కాజేసి, ఖాళీ హుండీని సమీపంలోని వ్యాసగుడి వద్ద పడేసి పరారయ్యారు. మంగళవారం తెల్లవారుజామున నిత్య పూజల కోసం ఆలయానికి వచ్చిన అర్చకులు, గేట్లు పగిలి ఉండటం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మహంకాళి అమ్మవారి...