పరకాల తహసీల్దార్‌పై కలెక్టర్ చర్యలు తీసుకునేనా..?
కోర్టు కేసులో ఉన్న భూమికి పట్టా జారీ...వెలుగులోకి తహసీల్దార్ అక్రమ మ్యుటేషన్ అక్రమం బయటపడటంతో సర్వే నంబర్ బ్లాక్.. భాధితుల ఫిర్యాదు తో ఫైలు పంపాలంటూ ఆర్డీఓ లేఖ.. అసలు ఆ ఫైలు కార్యాలయంలో భద్రంగా ఉందా? తహసీల్దార్ లీలలు వెలుగుచూసి 20 రోజులు గడుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లున్న యంత్రాంగం.. కలెక్టర్ స్పందనపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పరకాల ప్రజలు న్యాయాన్ని రక్షించాల్సిన అధికార్లే అక్రమార్కులకు కొమ్ముకాస్తే ఇక సామాన్యుడికి దిక్కెవరు? కోర్టు పరిధిలో ఉన్న భూమిని కంటిముందు కనిపిస్తున్నా కాసులకు కక్కుర్తి పడి పట్టాలు మార్చేస్తే పేదల గోడు ఎవరు వినాలి? హన్మకొండ జిల్లా పరకాల మండల రెవెన్యూ కార్యాలయంలో సాగుతున్న ఇలాంటి ఓ...