ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిక: రంగంలోకి ‘బాస్‌ స్కామ్‌’!

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పంథాలను ఎంచుకుంటూ అమాయకులను, సంస్థలను దోచుకుంటున్నారు. తాజాగా 'బాస్ స్కామ్ '‘పేరిట సరికొత్త మోసానికి తెరలేపినట్లు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నింటికీ బ్యూరో అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. ​లక్ష్యం ఎవరంటే..? ​ఈ సరికొత్త సైబర్ దాడిలో ప్రధానంగా వ్యాపార సంస్థల అధిపతులు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు, ప్రభుత్వ ఉన్నతాధికారులను నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వారి పేరుతో లేదా వారిని బురిడీ కొట్టించేలా ఈ మోసాలకు పాల్పడుతున్నారు. ​మోసం జరిగే విధానం ​నేరగాళ్లు ఇమెయిల్‌ లేదా వాట్సాప్‌ ద్వారా బాధితులకు మోసపూరితమైన ఫైళ్లను (Malicious Files) పంపుతారు. అవి ముఖ్యమైన...