​మహిళా సాధికారతకు సమిష్టి కృషి తప్పనిసరి: కల్వకుంట్ల కవిత

వెటా ఇండియా మహిళా సాధికారత సదస్సులో ముఖ్య అతిథిగా ప్రసంగం ​సమాజంలో మహిళలకు ఇంకా తొలగని అడ్డంకులు ​మహిళల ఎదుగుదలకు కుటుంబం, ప్రభుత్వం, సమాజం తోడ్పడాలి ​ మహిళలు నిజమైన సాధికారత సాధించాలంటే ప్రభుత్వం, కుటుంబం, మరియు సమాజం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించిన "వెటా ఇండియా మహిళా సాధికారత" సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ​ప్రతిభ ఉన్నా తప్పని అడ్డంకులు ​ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. నేటి సమాజంలో మహిళలు ఎంతటి ప్రతిభ కనబరిచినా, ఎంత కష్టపడి పనిచేసినా వారి...