డీటీవో వెంకన్న మృతిపై అధికారుల సమగ్ర విచారణ
ఘటనాస్థలిలో ప్రత్యక్ష పరిశీలన.. సీసీటీవీ ఫుటేజీ, లారీ రికార్డుల పరిశీలన ఒకటి, రెండు రోజుల్లో రవాణా కమిషనర్‌కు ప్రాథమిక నివేదిక భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి (డీటీవో) వెంకన్న రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటనపై రవాణా శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ నెల 22న భూపాలపల్లిలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో బొగ్గు లారీ ఢీకొనడంతో వెంకన్న అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించేందుకు జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ బుధవారం భూపాలపల్లిలో విచారణ నిర్వహించారు. ముందుగా గణపూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన, ప్రమాద ఘటనపై పోలీసులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తు వివరాలను సీఐ...