నోరూరించే పచ్చళ్ల వెనుక ప్రాణాంతక నిజం.. వరంగల్‌లో కేటుగాడి అరెస్ట్!
కాశీబుగ్గలో కల్తీ పచ్చళ్ల గుట్టురట్టు.. టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి! రూ. 2.25 లక్షల విలువైన కుళ్లిపోయిన నిల్వలు స్వాధీనం అపరిశుభ్ర వాతావరణంలో తయారీ.. నిందితుడు శ్రీనివాస్ అరెస్ట్ వరంగల్, జూన్ 25(మన విశ్వం ): ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటూ, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో అక్రమంగా నడుస్తున్న ఒక కల్తీ పచ్చడి తయారీ కేంద్రంపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. నగరంలోని కాశీబుగ్గ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ నకిలీ దందాను రట్టు చేసి, ఒకరిని అరెస్ట్ చేయడంతో పాటు రూ. 2.25 లక్షల విలువైన కుళ్లిపోయిన నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. కూరగాయలు కావు.. కుళ్లిపోయిన వ్యర్థాలు! ఇంతేజార్‌గంజ్ పోలీస్...